Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

హెచ్ బి కాలనీ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు మీర్ పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ ఫేజ్‌–1లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని అన్నారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన పాపన్న గౌడ్ ఆధిపత్యం, బానిసత్వాన్ని ధిక్కరించి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. తెలంగాణలో అనేక కోటలను నిర్మించి అప్పటి పాలకులను ఎదురించి పోరాడిన ఆయన ధైర్యసాహసాలు, ఆత్మగౌరవ భావన, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే, కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం నాయకులు మల్లేష్ గౌడ్, ఏ. కృష్ణ గౌడ్, ముత్యం వెంకన్న గౌడ్, బాలయ్య గౌడ్, సురేష్ గౌడ్, భూపాల్ గౌడ్, సాయిలు గౌడ్, శ్రవణ్, ఎట్టయ్య గౌడ్, యు. శీను, ఏ. అంజయ్య గౌడ్, చెక్కిళ్ళ చంద్రశేఖర్ గౌడ్, నవీన్ గౌడ్, కిషోర్, డి. నరసింహ గౌడ్, హనుమాన్ దాస్ గౌడ్, యాదగిరి గౌడ్, అశోక్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, చారి తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.