Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణసెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై ఐక్య ఉద్యమం

హైదరాబాద్, సెప్టెంబర్ 02, (తెలంగాణ దిశ) : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల చిరకాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ బి. రవి ప్రకాష్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కులు, ఆర్థిక భద్రత, సంక్షేమం కోసం చేపడుతున్న ఈ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ‘చలో హైదరాబాద్’ కార్యక్రమ విజయవంతానికి సంబంధించి బుధవారం నాంపల్లిలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో సన్నాహక సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యక్రమ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బి. రవి ప్రకాష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘చలో హైదరాబాద్’ కేవలం ఒక కార్యక్రమం కాదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని అందించే ఐక్య ఉద్యమమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 10న పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చి ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని ఆయన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.