Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణసరళా రెడ్డి జ్ఞాపకాలు చిరస్మరణీయం..

సరళా రెడ్డి జ్ఞాపకాలు చిరస్మరణీయం..

సరళ రెడ్డికి అశృ నివాళులు

కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ

భద్రాచలం, సెప్టెంబర్‌ 01, (తెలంగాణ దిశ) : ఇటీవల మృతి చెందిన సరళా రెడ్డికి పలువురు ప్రముఖులు మంగళవారం ఘనంగా అశ్రునివాళులు అర్పించారు. భద్రాచలంలోని ఆమె స్వగృహంలో మంగళవారం సరళా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త, టీవీ9 రిపోర్టర్‌ అనిల్‌ రెడ్డిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు..ఈ సందర్భంగా డీఎస్ పీ అరుణ్‌ కుమార్‌ సరళా రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆమె మంచితనం, ఆప్యాయంగా పలకరించే స్వభావం, ఇతరులకు సహాయం చేయడంలో ముందుండే గుణం గురించి పలువురు ప్రముఖుల ద్వారా తెలుసుకున్నానని పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో కలివిడిగా ఉంటూ అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సరళా రెడ్డి జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. సరళా రెడ్డి మృతి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్న డీఎస్పీ.. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరని అన్నారు. ఈ కష్ట సమయంలో అనిల్‌ రెడ్డి ధైర్యంగా ఉండి, కుటుంబాన్ని ఆదుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

సరళా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం : సీపీఎం

సరళా రెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. అందరితో కలివిడిగా ఉంటూ తన ఆప్యాయతతో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన సరళా రెడ్డి మృతి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ అన్నారు. సీపీఎం నాయకుల బృందం సరళా రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అశ్రునివాళులు అర్పించింది. అనంతరం ఆమె భర్త అనిల్‌ రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో మనోధైర్యంతో ఉండి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని వారు సూచించారు. సరళా రెడ్డి ఆప్యాయత, మంచితనం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం కారణంగా ఆమెను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటున్నారని, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతాయని నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.