భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానికులు
కుషాయిగూడ, సెప్టెంబర్ 14, (తెలంగాణ దిశ) : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కుషాయిగూడలోని అన్నపూర్ణ ఎస్టేట్‌లో తొలి రోజు వినాయక స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఎస్టేట్ కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రామ్మోహన్ రావు, కొత్త రామారావు, అన్నపూర్ణ ప్రసాద్, గురుస్వాములు ఎస్ఆర్ శ్రీను, గంగాధర్, బోసు, ఎంపీ. ప్రసాద్, జవహర్ బాబు, సబినేని వాసు, గోపాల్, వీరశేఖర్, మల్లికార్జున్ రెడ్డి, అశోక్ గౌడ్, శ్రీనివాసులు, మనీ, వి. కృష్ణ, బుజ్జి, చిన్న మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ ఎస్టేట్ కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు వినాయక స్వామివారికి పూజలు నిర్వహించి, ఉత్సవాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా అన్నపూర్ణ ఎస్టేట్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




