Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణవినాయక నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సెలవు

వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సెలవు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు రెండు జిల్లాల పరిధిలో సెలవు.. నవంబర్ 14 పనిదినం

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (తెలంగాణ దిశ) : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ శుక్రవారం హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఆర్‌.టి. నంబర్ 1396 ప్రకారం సెప్టెంబర్ 25న ప్రకటించిన సాధారణ సెలవుకు బదులుగా 2026 నవంబర్ 14వ తేదీ (రెండవ శనివారం)ను పని దినంగా పరిగణించనున్నారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొనే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెలవు, ప్రత్యామ్నాయ పనిదినానికి సంబంధించిన నిబంధనలను సంబంధిత ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.