Sunday, October 11, 2026
spot_img
Homeతెలంగాణగాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కాంగ్రెస్ ఏఎస్ రావునగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా 157వ జయంతి వేడుకలు

 

ఏఎస్ రావునగర్, అక్టోబర్ 2 (తెలంగాణ దిశ):

జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాధిక మూవీ ప్లెక్స్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. శెట్టి ప్రసాద్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్రను, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రావునగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.