Friday, November 27, 2026
spot_img
Homeతెలంగాణఉప్పల్ లోని ఎల్ బి నగర్ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ మెరుపు దాడులు

ఉప్పల్ లోని ఎల్ బి నగర్ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ మెరుపు దాడులు

క్రాకర్ షాపుల అనుమతులకు లంచం డిమాండ్.. 

ఉప్పల్, నవంబర్ 06, (తెలంగాణ దిశ): 

దీపావళి సందర్భంగా క్రాకర్ షాపుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఉప్పల్ భగాయత్‌లోని అగ్నిమాపక కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్ బి నగర్ పరిధికి సంబంధించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో క్రాకర్ షాపుల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై రంగారెడ్డి ఏసీబీ డీఎస్ పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి సీఐతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించారు. సోదాల్లో రూ.40 వేల నగదును గుర్తించడంతో పాటు, 80 ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. క్రాకర్ షాపుల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన రికార్డులను సైతం తనిఖీ చేస్తున్నారు. లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆరోపణలపై నగదు లావాదేవీలు, దరఖాస్తుల పెండింగ్‌కు గల కారణాలు, సంబంధిత అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది

.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.