వరంగల్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి స్వర్ణను ఘనంగా సన్మానించి, శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఎర్రబెల్లి స్వర్ణ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా కాంగ్రెస్ను రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ, మహిళలను రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులను చేయడంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం మరింత ఉత్సాహంతో పని చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎర్రబెల్లి స్వర్ణకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, రాజకీయంగా మరింత ఉన్నత స్థానం లభించాలని నాయకురాళ్లు ఆకాంక్షించారు. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, వివిధ విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్రబెల్లి స్వర్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాళ్లు నీలం పద్మ, రాజనోళ్ల లక్ష్మి, కర్నాటి పార్వతమ్మ, బంక సరళ, బడిక ఇందిర, సౌజన్య, శ్రీ జ్యోతి, శంబుల ఉషశ్రీ, ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షురాళ్లు సుగుణ రెడ్డి, బోయపల్లి రేఖ, శైలజ నాయిని రజితతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు వివిధ జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




