ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి, ఉప్పల్ జెడ్ సి రాధిక గుప్తా
రూ. 30 కోట్ల వ్యయంతో ఆత్మ గౌరవ భవనం నిర్మాణం
ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
రాష్ట్ర ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలి
మేడ్చల్ జిల్లాకే గర్వకారణం : బెలిదే రమేష్ గుప్
ఉప్పల్, సెప్టెంబర్ 11, తెలంగాణ దిశ : ఉప్పల్ భాగాయత్ లో ఈనెల 13న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన ఆత్మ గౌరవ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ భవన నిర్మాణం కోసం ఆర్య వైశ్యుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ బగాయత్ లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు బెలిదే రమేష్ గుప్తా, బచ్చు నగేష్ గుప్తాల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ హాజరై ఈనెల 13న ఉప్పల్ భగయత్ లో నిర్వహించతలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. తమ జిల్లాలో రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఆత్మ గౌరవ భవన నిర్మాణం జరగడం ఎంతో గర్వంగా ఉందని మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది ఆర్య వైశ్యుల తరలిరావాలని వారు పిలుపు నిచ్చారు. ఈనెల 13న ఉదయం ఎనిమిది గంటలకు భూమి పూజ స్థలంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆసక్తి ఉన్న దంపతులు పాల్గొనవచ్చునని వారు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఉప్పల్ బాగాయత్ లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఉదయం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎంఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్యవైశ్య మహాసభ నిర్వాహకులకు వారు సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆర్య వైశ్యుల ఐక్యతను చాటుకోవాలని నిర్వాహకులు కోరారు.




