Sunday, October 11, 2026
spot_img
Homeతెలంగాణవరంగల్ విమానాశ్రయ టెర్మినల్‌కు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి

వరంగల్ విమానాశ్రయ టెర్మినల్‌కు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి

నైస్ డిజైనర్స్ అండ్ నైస్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజారావు

కుషాయిగూడ, అక్టోబర్ 02, (తెలంగాణ దిశ) :

వరంగల్‌లో నిర్మిస్తున్న మామునూరు విమానాశ్రయ టెర్మినల్‌కు భారత దేశ మాజీ ప్రధానమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) పేరు పెట్టాలని కుషాయిగూడకు చెందిన నైస్ డిజైనర్స్ అండ్ నైస్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజారావు ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో పీవీ నరసింహారావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్న సమయంలో ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని తెలిపారు. పీవీ నరసింహారావు పరిపాలనా అనుభవం, దూరదృష్టితో దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని రాజా రావు పేర్కొన్నారు. అనేక భారతీయ, విదేశీ భాషలపై ఆయనకు ఉన్న పట్టు ఆయన విస్తృతమైన జ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆయనకు 17 భాషలపై పరిజ్ఞానం ఉన్నట్లు ప్రస్తావించారు. ప్రస్తుతం మామునూరు విమానాశ్రయానికి పేరు నిర్ణయించే అంశంపై వివిధ వర్గాల నుంచి పలు సూచనలు వస్తున్నాయని అన్నారు. రాణి రుద్రమదేవి, కాకతీయ, సమ్మక్క-సారక్క, పీవీ నరసింహారావు తదితర పేర్లు చర్చలో ఉన్నాయని, తుది పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని, ఈ నేపథ్యంలో దేశానికి విశిష్ట సేవలందించిన పీవీ నరసింహారావు పేరును విమానాశ్రయ టెర్మినల్‌కు పెట్టడం ద్వారా ఆయన సేవలను భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చేయవచ్చని రాజా రావు అభిప్రాయపడ్డారు. జాతీయ అభివృద్ధిలో చిరస్థాయిగా ముద్ర వేసిన నాయకుల సేవలను గుర్తించే విస్తృత దృక్పథంలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.