కుషాయిగూడ: ఆగస్టు 27, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సహచరీలతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సహచరీలతో మమేకమై, వారి కాలనీలు, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, వారి దృష్టికి వచ్చే అనుమానాస్పద లేదా అవాంఛనీయ విషయాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహచరీలు చురుకైన పాత్ర పోషిస్తూ పోలీసులకు సహకరించాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు సమాచారాన్ని పోలీసులకు అందించి, వారితో సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో కలిసి సహచరీలు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఎన్. వెంకన్న, సిహెచ్. సాయిలు, ఎం. విజయ్‌తో పాటు కుషాయిగూడ పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కుషాయిగూడ పరిధిలోని సహచరీలను కార్యక్రమంలో భాగస్వాములను చేసి, వారికి రాఖీలు కట్టించుకుని రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.




