నాగారం, ఆగస్టు 14, (తెలంగాణ దిశ):
దేశభక్తిని చాటుతూ నాగారంలోని సెరినిటీ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాగారం పుర వీధులను హోరెత్తించారు. సెరినిటీ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ రాంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం రాంపల్లి చౌరస్తా నుంచి నాగారం ప్రధాన వీధుల మీదుగా తిరిగి పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ తిరంగా ర్యాలీలో సుమారు 600 మంది సెరినిటీ పాఠశాల విద్యార్థులు, పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, పాఠశాల కార్యదర్శి నోముల వసంత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి నినాదాలు, త్రివర్ణ పతాకాలతో ర్యాలీ సాగడంతో నాగారం వీధుల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జంగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించడంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు. ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని చాటడానికి భారత ప్రభుత్వం హార్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి పౌరుడు తమ ఇళ్లపై జాతీయ జెండా ను ఎగుర వేయాలని బిజెపి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి పిలుపు నిచ్చారు. జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఈ ఉత్సవాలను జాతీయ గీతానికి అంకితం చేశారని మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిజ్జా శ్రీనివాస్, సురేష్, నాగరాజు, రవీందర్ రెడ్డి, రాంపల్లి సురేష్, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




