Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణఐఅండ్‌పీఆర్ జేడీ జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి

ఐఅండ్‌పీఆర్ జేడీ జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి

అభినందనలు తెలిపిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

 

హైదరాబాద్, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డిఎస్. జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో ఫెడరేషన్ నాయకులు మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌లో జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. సమాచార, పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన డిఎస్. జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించడం అభినందనీయమన్నారు. తన అనుభవంతో శాఖకు మరింత సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫెడరేషన్ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు కుంచం శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె. పాండురంగారావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, రంగారెడ్డి జిల్లా నాయకులు నంబి పర్వతాలు, గోవింద్ నాయక్, ఎం. రవికుమార్ తదితరులు పాల్గొని నూతన అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.