Monday, October 12, 2026
spot_img
Homeఆధ్యాత్మికంఐదు అడుగులకు పైబడిన గణపతుల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలి

ఐదు అడుగులకు పైబడిన గణపతుల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలి

కాప్రా చెరువులో నిమజ్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసిన గణేష్ ఉత్సవ సమితి

ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఐదు అడుగులకు పైబడిన గణపతి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి కల్పించాలని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కోరారు. ఈ మేరకు డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో సమితి సభ్యులు మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా కాప్రా చెరువులో కొనసాగుతున్న హైడ్రా సుందరీకరణ పనులు, రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ఎదురయ్యే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఐదు అడుగులకు పైబడిన గణపతి విగ్రహాల నిమజ్జనం అంశాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్‌గా ఎన్నికైన తాడూరి గగన్ కుమార్‌ను అభినందించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కాప్రా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, జవహర్‌నగర్, కుషాయిగూడ పోలీసు అధికారులతో పాటు బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావనిరెడ్డిలను కూడా కలిసి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు నేమూరి మహేష్ గౌడ్, ఉత్సవ సమితి ఫౌండర్లు మర్రి మోహన్ రెడ్డి, పుల్లారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ కన్వీనర్ నీరుకొండ సతీష్ బాబు, కో-కన్వీనర్లు కుమారస్వామి, కిషోర్ చారి, ఆదినారాయణ, ఉమేష్ చారి, రమేష్, మొవ్వ శ్రీనివాస్, నరసింహ చారి, హరి, సిహెచ్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.