15 మంది అదుపులోకి.. హుక్కా సామగ్రి స్వాధీనం
కుషాయిగూడ, సెప్టెంబర్ 21, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. నేతాజీ నగర్ రోడ్డులోని ఎలైట్ కేఫ్ పేరుతో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు రైడ్ చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం ఎస్‌వి. రావు యజమానిగా, దిలీప్ మేనేజర్‌గా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడి సమయంలో అక్కడ ఉన్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హుక్కా వినియోగానికి సంబంధించిన 5 హుక్కా ఫ్లేవర్స్, 20 ఫిల్టర్లు, 6 హుక్కా పాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హుక్కా సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగూడ పోలీసులు తెలిపారు.




