Monday, October 12, 2026
spot_img
Homeఆధ్యాత్మికంజిల్లా కోర్టులో ఘనంగా గణపతి పూజలు

జిల్లా కోర్టులో ఘనంగా గణపతి పూజలు

కుషాయిగూడ, సెప్టెంబర్ 19, (తెలంగాణ దిశ) : కుషాయిగూడలోని మేడ్చల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతికి శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్‌రావు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడిజె తిరుపతి, 2వ ఏడిజె అమరావతి, ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీదేవి, పోక్సో కోర్టు జడ్జి ఆశాలత, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సత్తు రవీందర్, 1వ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్, 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు, కోర్టు సిబ్బందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.