Monday, October 12, 2026
spot_img
Homeతెలంగాణసరళారెడ్డి అకాల మరణం తీరని లోటు

సరళారెడ్డి అకాల మరణం తీరని లోటు

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొలగాని రమేష్

భద్రాచలం, సెప్టెంబర్ 08, (తెలంగాణ దిశ) : భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 రిపోర్టర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్‌రెడ్డి సతీమణి సరళారెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని సీఐటీయూ అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొలగాని రమేష్ అన్నారు. మంగళవారం విద్యుత్ యూనియన్ నాయకులతో కలిసి ఇటీవల మృతి చెందిన సరళారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కర్ర అనిల్‌రెడ్డిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కొలగాని రమేష్ మాట్లాడుతూ సరళారెడ్డి మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉంటూ, తాను నేర్చుకున్న వృత్తి నైపుణ్యాలను పలువురికి నేర్పి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి సరళారెడ్డి అని కొనియాడారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె చిన్న వయసులోనే మృతి చెందడం దురదృష్టకరమన్నారు. సరళారెడ్డి లేని లోటును ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కార్యదర్శి పదిలం శ్రీనివాస్, గుడ్ల రవి, 327 యూనియన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు జి. సర్వేశ్వరరావు, టీఆర్‌వీకేఎస్ యూనియన్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి భీమాపాక పెదరాజు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు బానోత్ యుగంధర్, హనుమాన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.