Monday, October 12, 2026
spot_img
HomeUncategorizedచర్లపల్లి డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి, ఆగస్టు 18 (తెలంగాణ దిశ): చర్లపల్లి డివిజన్‌లో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను ఇక ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను ఎమ్మెల్యే కలిసి చర్లపల్లి డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనుల వివరాలను చర్చించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులకు కూడా అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని బండారి లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు ఆలస్యం కాకుండా మంజూరైన ప్రతి పనిని ప్రాధాన్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

App Icon

Install TD News App

Add to home screen for faster loading and latest updates.